: ముగిసిన జానకీరామ్ అంత్యక్రియలు
నందమూరి జానకీరామ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మొయినాబాద్ మండలం ముర్తుజాగూడలోని ఫాంహౌస్ లో ఆయన చితికి తనయుడు తారక రామారావు నిప్పటించాడు. ఈ దహన సంస్కారాలకు హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు, నందమూరి కుటుంబ అభిమానులు వెనుదిరిగారు. కాగా, అంత్యక్రియలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జానకీరామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.