: సినీ తారల క్రికెట్ మ్యాచ్ వాయిదా
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం నిధులు సేకరించేందుకు టాలీవుడ్ తారలు క్రికెట్ మ్యాచ్ ఆడాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న విజయవాడలో మ్యాచ్ జరపాలని తొలుత నిర్వహించారు. అయితే, ఈ మ్యాచ్ ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు నటుడు శ్రీకాంత్ తెలిపారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.