: లొంగిపోయిన తమిళ నటుడు విజయకాంత్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కేసులో ఇరుక్కున్న నటుడు, డిఎండికె పార్టీ అధినేత విజయకాంత్ ఈ రోజు తిరునల్వేలి కోర్టులో లొంగిపోయారు. కేసు విచారణకు వరుసగా గైర్హాజరవుతున్న విజయకాంత్ పై తిరునల్వేలి కోర్టు న్యాయమూర్తి నిన్న అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో విజయ్ కాంత్ లొంగిపోక తప్పలేదు.