: పాక్ క్రికెట్ కు ఐసీసీ మరో షాక్


పాకిస్థాన్ క్రికెట్ కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరోసారి షాకిచ్చింది. ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. హఫీజ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఐసీసీ తేల్చింది. హఫీజ్ కు గత నెలలో బయోమెట్రిక్ పరీక్షలు నిర్వహించిన నిపుణులు ఐసీసీకి నివేదిక సమర్పించారు. ఆఫ్ స్పిన్నరైన హఫీజ్ బౌలింగ్ చేసే సమయంలో మోచేతిని ఎక్కువగా వంచుతున్నట్టు పరీక్షల్లో స్పష్టమైంది. ఐసీసీ ఇప్పటికే పాక్ స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ను సస్పెండ్ చేయడం తెలిసిందే. తాజా నిర్ణయం పాక్ క్రికెట్ కు గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చు. ఎందుకంటే, హఫీజ్ ను వరల్డ్ కప్ ప్రాబబుల్స్ కు ఎంపిక చేశారు కూడా. అంతలోనే ఐసీసీ షాకింగ్ న్యూస్ చెప్పడంతో పాక్ క్రికెట్ బోర్డు ఏమీ పాలుపోని స్థితిలో పడిపోయింది.

  • Loading...

More Telugu News