: జానకీరామ్ అంతిమయాత్ర ప్రారంభం


నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ అంతిమయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మాసాబ్ ట్యాంక్ లోని హరికృష్ణ నివాసం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మొయినాబాద్ మండలం ముర్తుజాగూడలోని ఫాం హౌస్ దాకా కొనసాగనుంది. ఈ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఫాంహౌస్ లో వేగంగా జరుగుతున్నాయి. తొలుత పంజాగుట్టలోని శ్మశానవాటికలో నిర్వహించాలని తలచినా, అంత్యక్రియల వేదికను ఫాంహౌజ్ కు మారుస్తూ నేటి ఉదయం నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక, మధ్యాహ్నం 12 గంటలకే అంత్యక్రియలను నిర్వహించాలని తలచినా, సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. జానకీరామ్ అంతిమయాత్రలో నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News