: అమితాబ్ ఫేస్ బుక్ ఫాలోయర్ల సంఖ్య 1.80 కోట్లు!
బాలీవుడ్ అగ్రనటుడు, 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో దూసుకెళుతున్నారు. సినిమాల్లోనే కాక సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ తనకెవరూ సాటిరారని కూడా ఆయన చాటిచెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఫేస్ బుక్ ఖాతాను 1.80 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. తన ఫేస్ బుక్ ఫాలోయర్ల సంఖ్య 1,80,18,000 అని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ట్విట్టర్ లో తనను 90 లక్షల మంది ఫాలో అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘సోషల్ మీడియాలో నన్ను అనుసరిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు’ అంటూ ఆయన తన ఫాలోయర్లకు థాంక్స్ చెప్పారు.