: సీఎంల భేటీకి డుమ్మా కొట్టిన మమత, ఒమర్!
ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తూ కొత్త సంఘాన్ని రూపొందించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు చేపట్టిన ముఖ్యమంత్రుల సమావేశానికి పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, ఒమర్ అబ్దుల్లా డుమ్మా కొట్టారు. భార్య మేనల్లుడు జానకీరామ్ మృతి చెందినప్పటికీ భేటీ ప్రాధాన్యం దృష్ట్యా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, బీజేపీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలోనే మమత, ఒమర్ లు ఈ సమావేశానికి హాజరుకాలేదని సమాచారం.