: జానకీరామ్ మృతదేహానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ ల నివాళి


టీడీపీ నేత, మాజీ ఎంపీ హరికృష్ణ పెద్ద కొడుకు జానకీరామ్ మృతదేహానికి కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి నివాళి అర్పించారు. కొద్దిసేపటి క్రితం మాసాబ్ ట్యాంక్ లోని హరికృష్ణ నివాసానికి వెళ్లిన చిరంజీవి జానకీరామ్ మృతదేహానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన హరికృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరోవైపు చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ కూడా జానకీరామ్ మృతదేహానికి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News