: జానకీరామ్ అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం
సినీ నటుడు, టీడీపీ నేత హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ అంత్యక్రియలకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాజరయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న కీలక సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఆ సమావేశం ముగిసిన మరుక్షణమే చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరనున్నట్లు సమాచారం. చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలోనే జానకీరామ్ అంత్యక్రియలను మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.