: పారిశ్రామికవేత్తగా ఎదగడమే జానకీరామ్ లక్ష్యం: కొడాలి నాని


హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ దేశంలోనే పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగారని వైకాపా నేత కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం మొత్తం సినిమాలు, రాజకీయాల చుట్టూ తిరిగితే జానకీరామ్ మాత్రం పారిశ్రామిక రంగం వైపు అడుగులేశారని ఆయన చెప్పారు. శనివారం నాటి రోడ్డు ప్రమాదంలో జానకీరామ్ మృత్యువాత నేపథ్యంలో ఆదివారం హరికృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు కొడాలి నాని మాసాబ్ ట్యాంక్ లోని వారి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాని జానకీరామ్ తో తన పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ, రాజకీయ నేపథ్యం ఉన్నా, జానకీరామ్ ఏనాడు ఆర్భాటాలకు పోలేదని ఆయన అన్నారు. అంతేకాక వంశపారంపర్యంగా అందివచ్చిన ఆస్తులపై ఆధారపడని జానకీరామ్ అమెరికాలో పదేళ్ల పాటు పనిచేసి బాగానే డబ్బు ఆర్జించారని చెప్పారు. ఆ డబ్బుతోనే కాకినాడలో కోవలెంట్ పరిశ్రమను నెలకొల్పుతున్నారన్నారు. మరో నెల రోజుల్లో సదరు కంపెనీ ప్రారంభం కానున్న నేపథ్యంలో జానకీరామ్ అస్తమయం తనను కలచివేసిందన్నారు. మరింతకాలం బతికి ఉంటే జానకీరామ్ విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగేవారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News