: రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం నేడే!


ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. నేడు ఢిల్లీలో జరగనున్న సమావేశంలో ఆయన సీఎంలతో పలు విషయాలపై కూలంకషంగా చర్చిస్తారు. అంతేకాక వివిధ విధాన నిర్ణయాలపై ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు. ప్రధానంగా ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తూ, దాని స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సంస్థ విధివిధానాలు, బాధ్యతలపై ఆయన ముఖ్యమంత్రుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు సమాచారం. కొత్త సంస్థ ఏర్పాటుకు సంబంధించి సీఎంలు వెల్లడించే అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలని మోదీ నిర్ణయించుకున్నట్లు ప్రధాన మంత్రిత్వ కార్యాలయ అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో సాధికారత కల్పించడానికే తాము ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా కార్యరంగంలోకి దిగనున్న సంస్థ ఈ దిశగా పనిచేయనుందని తెలుస్తోంది. నేటి సమావేశం సందర్భంగా కొత్త సంస్థ రూపకల్పన, విధివిధానాలపై ప్రణాళిక శాఖ కార్యదర్శి సింధుశ్రీ భుల్లార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం మోదీ దీనిపై సీఎంల అభిప్రాయాలను స్వీకరిస్తారు.

  • Loading...

More Telugu News