: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ హచ్ ల విధానంలో మార్పు రావాలి: చంద్రబాబు


రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడేలా జాతీయ రహదారుల విధానంలో మార్పు రావాల్సి ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయిన తన బావ హరికృష్ణను పరామర్శించిన సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారులపై డివైడర్లు, రహదారులను ఆనుకుని ఉన్న ఇతర రహదారులను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. జాతీయ రహదారుల వ్యవస్థ సరిగా లేకుంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశముందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రస్తుత జాతీయ రహదారుల వ్యవస్థ విధానాన్ని మార్చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News