: ఢిల్లీ రోడ్లపైకి త్వరలోనే ఈ-రిక్షాలు!
బ్యాటరీ సాయంతో నడిచే ఈ రిక్షాలు త్వరలో ఢిల్లీ రోడ్లపై సందడి చేయనున్నాయి. మోటారు వాహనాల చట్టంలో మార్పులను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఈ-రిక్షాలకు లైసెన్సులు జారీ చేసే అవకాశం ఉంది. గతంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ-రిక్షాలపై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించడంతో ఇవి కనుమరుగయ్యాయి. ఈ వాహనాల డ్రైవర్లకు కూడా లైసెన్స్ జారీ చేసే విధివిధానాలు సులభం చేశారు.