: నందమూరి జానకీరామ్ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే...!


హైదరాబాదు నుంచి విజయవాడకు సఫారీలో వెళ్తున్న నందమూరి జానకీరామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్ ను ఢీ కొట్టి పక్కనే గోతిలోకి కారుతో పల్టీ కొట్టాడు. ఈ క్రమంలో జానకీరామ్ కారులో ఇరుక్కుపోయాడు. ఘోర రోడ్డు ప్రమాదాన్ని చూసిన స్థానికులు, కారులో తీవ్రగాయాలతో పడి ఉన్న ఆయనను హుటాహుటీన కోదాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపు ఆయన మృతి చెందారు. కాగా, కారు ప్రమాదంలో ఆయన తల, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయి. వీటి కారణంగా అంతర్గత రక్తస్రావం జరిగి ఆయన మరణించి ఉండవచ్చని వైద్యులు తెలిపారు. కాగా, ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News