: అన్నయ్య మరణవార్త విని షాక్ కు గురైన జూనియర్ ఎన్టీఆర్
నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ మరణవార్త విన్న సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ షాక్ కు గురయ్యారు. అన్నయ్య అకాల మరణం ఆయనను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో ఆయన ఖిన్నుడైపోయాడు. వెంటనే భార్య, తల్లితో పాటు ఆయన హరికృష్ణ నివాసానికి చేరుకుని తండ్రిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు.