: హరికృష్ణ నివాసానికి చేరుకున్న చంద్రబాబునాయుడు
నందమూరి జానకీరామ్ అకాల మరణంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హుటాహుటీన హైదరాబాదు చేరుకున్నారు. అనంతపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. బావ హరికృష్ణ రోదనకు ఆయన చలించిపోయారు. బాబు కుటుంబ సభ్యులు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు.