: చెరువుల పునరుద్ధరణలో అందరూ పాల్గొనాల్సిందే: హరీష్ రావు
తెలంగాణ వ్యాప్తంగా చేపట్టనున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రజలంతా పాలు పంచుకోవాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. చెరువుల పునరుద్ధరణపై జూలూరు గౌరీశంకర్ రాసిన 'నీటిగుమ్మి' పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణను ప్రజలు విజయవంతం చేయాలని అన్నారు. అవినీతికి తావులేకుండా విజిలెన్స్ టీంలతో చెరువుల పునరుద్ధరణ పనులపై తనిఖీలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. చెరువుల పునరుద్ధరణలో నామినేషన్ విధానం లేదని, కేవలం టెండర్ల ద్వారానే పనులు కేటాయిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.