: ఔరా... వీరా... భవిష్యత్ న్యాయవాదులు?


ఒకప్పుడు న్యాయవాద విద్యనభ్యసించే వారిని మేధావులుగా, సమాజ హితం కోరే వారిగా, నీతి న్యాయానికి కట్టుబడ్డవారిగా అందరూ గుర్తించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. న్యాయశాస్త్రం చదివి న్యాయానికి పట్టం కట్టాల్సిన భవిష్యత్ న్యాయవాదులు పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతూ అడ్డంగా బుక్కయిపోయారు. కర్నూలు వేదికగా రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహిస్తున్న లా పరీక్షల్లో న్యాయవాద విద్యార్థుల గుట్టురట్టైంది. గైడ్లు, టెక్స్టు పుస్తకాలను కాపీ కొడుతూ పరీక్షలు రాశారు. వారు అంత పబ్లిక్ గా కాపీ కొడుతున్నప్పటికీ ఇన్విజిలేటర్లు వారిని అడ్డుకోకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News