: నివేదిక బయటపెట్టి...ల్యాండ్ పూలింగ్ చేయండి: వైఎస్సార్సీపీ


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు అవసరం లేదని, 10 నుంచి 15 వేల ఎకరాలు సరిపోతాయని అన్నారు. చట్టబద్ధత లేని ల్యాండ్ పూలింగ్ విధానంతో రైతులను బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని నిర్మాణానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని తెలిపిన ఆయన, అందుకు అవలంబిస్తున్న విధానాలను ప్రభుత్వం సరిచూసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News