: ప్రతి ఒక్కరికీ స్పూర్తిగా నిలిచారు: ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్


జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు ప్రతి ఒక్కరికీ స్పూర్తిగా నిలిచారని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ తెలిపారు. వీర జవాన్లకు నివాళులర్పించేందుకు శ్రీనగర్ వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడో దశ ఎన్నికలకు విఘాతం కల్పించేందుకే మిలిటెంట్లు దాడులకు తెగబడ్డారని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి జవానుకు వందనాలని అన్నారు. వీర జవాన్ల త్యాగాలు వృధాపోవని ఆయన పేర్కొన్నారు. అనంతరం భద్రతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

  • Loading...

More Telugu News