: హరికృష్ణ కుమారుడు నందమూరి జానకీరామ్ మృతి


దివంగత మహానేత ఎన్టీఆర్ మనవడు నందమూరి జానకీరామ్ రోడ్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడడంతో మరణించారు. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్తుండగా, నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను కారు ఢీ కొట్టింది. దీంతో జానకీరామ్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను కోదాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. కాగా, జానకీరామ్...నందమూరి హరికృష్ణ కుమారుడు. కాగా, జనకీరామ్ కు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మరణ వార్త విన్న కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కాగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తన సోదరుడు కల్యాణ్ రామ్ నటించే సినిమాలకు జానకీరామ్ నిర్మాతగా వ్యవహరించేవారు.

  • Loading...

More Telugu News