: ఉపదేశాలు ఇచ్చే నేతలు పెరిగారు: అన్నా హజారే
దేశంలో ఉపదేశాలు ఇచ్చే నేతలు పెరిగారని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తెలిపారు. హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, ఉపదేశాలను ఆచరించే నేతలు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్ పాల్ బిల్లు అమలుకు అవసరమైతే మరోసారి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ప్రజల్లో హక్కుల పట్ల అనాసక్తత పెరుగుతోందని, ఫలితంగా దోపిడీ స్వభావం పెరిగిపోతోందని ఆయన చెప్పారు. చిత్తశుద్ధి కలిగిన నేతలను ఎన్నుకోవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన సూచించారు.