: రూ. 34,50,000 విరాళమిచ్చిన ఎన్నారై టీడీపీ హూస్టన్ విభాగం
'హుదూద్' బాధితులను ఆదుకునేందుకు ఎన్నారై టీడీపీ హూస్టన్ విభాగం భారీ మొత్తంలో విరాళాలు సేకరించింది. వంగూరి ఫౌండేషన్ సహకారంతో హూస్టినియన్స్ ఫర్ హుదూద్ ఫండ్ రిలీఫ్ పేరిట నవంబర్ 7న విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. దీని ద్వారా 34,50,000 (56 వేల అమెరికన్ డాలర్లు) రూపాయల విరాళాలు సేకరించినట్టు వారు తెలిపారు. ఈ మొత్తాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేయనున్నట్టు సతీష్ నన్నపనేని తెలిపారు.