: కోహ్లీ టెస్టు కెప్టెన్సీ ఆశలు అడియాసలేనా?
టెస్టు జట్టుకు కెప్టెన్ గా పగ్గాలు చేపట్టి భవిష్యత్ కెప్టెన్ గా తనకు తిరుగులేదని నిరూపించాలని భావించిన కోహ్లీ ఆశలు అడియాసలయినట్టే కనబడుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరగనున్న తొలి టెస్టుకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిద్ధమయ్యాడు. తొలుత జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4న తొలి టెస్టు ప్రారంభమై ఉంటే కోహ్లీ కెప్టెన్ గా ఓ టెస్టు ఆడి ఉండేవాడు. ఫిల్ హ్యూస్ అకాలమరణంతో షెడ్యూల్ మొత్తం మారిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీ చేతి గాయం మాని ఫిట్ నెస్ పరీక్షల్లో పాస్ కావడంతో కోహ్లీ కెప్టెన్సీకి గండిపడింది. దీంతో కోహ్లీ టెస్టు కెప్టెన్సీ ఆశలు ఇప్పట్లో నెరవేరేట్టు కనిపించడం లేదు.