: తెలంగాణలోని దేవాలయాలకు రూ.2 కోట్లు విడుదల
తెలంగాణలోని 1,571 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల బకాయిలను విడుదల చేసింది. ఈ మేరకు రూ.2 కోట్లు విడుదల చేసే ఫైలుపై దేవాదాయ శాఖ కమిషనర్ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఐదు నెలల కాలానికి ఒక్కో దేవాలయానికి నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ధూపదీపనైవేద్య పథకం కింద జూన్ నుంచి నిధులు విడుదల చేయలేదు. దాంతో, పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితిని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష పార్టీలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. వెంటనే స్పందించిన ప్రభుత్వం తాజాగా ఆ పథకం కింద నిలిచిపోయిన బకాయిలు చెల్లించేందుకు సిద్ధమైంది.