: హైదరాబాదులో కొత్త సంవత్సర పార్టీలకు ఈసారి పన్ను
కొన్ని రోజుల్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు హైదరాబాదు నగరం సిద్ధమవుతోంది. అయితే నగరంలో ఈసారి పార్టీలు నిర్వహించే నిర్వాహకులు వాణిజ్య పన్ను కట్టాలని కమర్షియల్ ట్యాక్స్ కమిషన్ ఆదేశించింది. అనుమతి తీసుకుని ముందుగానే పన్ను కట్టకపోతే తరువాత ఐదు రెట్లు జరిమానా విధిస్తామని వెల్లడించింది. న్యూ ఇయర్ పార్టీలకు ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ వర్తిస్తుందని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తెలిపారు.