: ఈ దేవాలయంలో విదేశీ మద్యాన్ని కానుకగా ఇవ్వవచ్చు!


గుజరాత్ లోని భుజ్ పట్టణంలో భక్తులు దేవుని నుంచి ఆశీస్సులు పొందటానికి ఓ దేవాలయంలో ప్రత్యేకంగా తమకు ఇష్టమైన విదేశీ మద్యం బాటిళ్లను కానుకగా సమర్పిస్తారట. ఇందుకోసం టీచర్స్ విస్కీ నుంచి స్మిర్నోఫ్, యాంటిక్విటీ, జానీ వాకర్ వంటి పలు రకాల మద్యం బ్రాండ్లను ఆలయంలోని దేవుడి ముందు పెడతారు. భుజ్-ముంద్రా రహదారికి పక్కగా ఉన్న ఆ ఆలయంలోని కాలభైరవుడిని భక్తులు ఎప్పుడూ సందర్శించుకుని విలువైన మద్యం బ్రాండ్ ఒకదాన్ని సమర్పించుకుంటారు. ఇటీవలే రహదారి పక్కన స్థానికులు నెలకొల్పిన ఆ దేవాలయంకు పాప్యులారీటీ కూడా బాగానే వచ్చిందట. "ఈ కాలభైరవ ఆలయం మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఓ ఆలయానికి నకలు. మీరేదైనా దేవునికి సమర్పించాలనుకుంటే, అక్కడే దుకాణాల్లో చిన్నపాటి విదేశీ మద్యం బాటిళ్లను అమ్ముతారు. వాటిని కొని సమర్పించవచ్చు" అని అక్కడి అమ్మకందారుడు ప్రసాదీ కనాని తెలిపాడు.

  • Loading...

More Telugu News