: టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నీతా అంబానీ?


తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త బోర్డు సభ్యుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ భార్య, మహిళా వ్యాపారవేత్త అయిన నీతా అంబానీని కూడా కార్యనిర్వాహక బోర్డులో సభ్యురాలిగా నియమించినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో బోర్డును అధికారికంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే బోర్డులో సభ్యత్వం కోసం ప్రభుత్వానికి 1,200 దరఖాస్తులు వచ్చాయి. వాటి నుంచి సభ్యులను ఎంచుకున్నారని తెలిసింది. అయితే, నీతా కాకుండా సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో, బీజేపీ నేత శివాజీ, ఏపీ బీజేపీ అధికారప్రతినిధి జీ.భాను ప్రకాష్ రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. వీరందరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురి పేర్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి సదానంద గౌడ, పార్టీ అగ్రనేతలు బోర్డుకు సిఫారసు చేశారు. వారందరిని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందట. సాధారణంగా టీటీడీ బోర్డులో ఛైర్మన్ తో కలిపి 15 మంది సభ్యులే ఉంటారు. కానీ, ఈసారి తెలుగు మాట్లాడే కొత్త రాష్ట్రం తెలంగాణను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు, మొత్తం 18 మంది సభ్యులను తీసుకోవాలని తలంచారు.

  • Loading...

More Telugu News