: యూఎస్ హిట్ లిస్ట్ లోని అల్-ఖైదా ముఖ్య నేత హతం


న్యూయార్క్, లండన్ నగరాల్లో రైళ్ళను పేల్చివేయాలని కుట్ర పన్నిన అల్-ఖైదా చీఫ్ (ఆపరేషన్స్) అద్నాన్ అల్ షుక్రిజుమాను హతమార్చినట్టు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. పాక్, ఆఫ్ఘన్ సరిహద్దుల్లో సైన్యం జరిపిన దాడిలో షుక్రిజుమా మరణించినట్టు తెలిపింది. కాగా, సౌదీ అరేబియాలో జన్మించిన షుక్రిజుమా అమెరికాలో చాలా సంవత్సరాలు ఉన్నాడని ఎఫ్ బీఐ వెల్లడించింది. 2009లో న్యూయార్క్ లోని సబ్ వే పై జరిగిన బాంబు దాడిలో షుక్రిజుమా నిందితుడని తెలిపింది. షుక్రిజుమాపై అమెరికా ప్రభుత్వం 5 మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించి ఉంది. కాగా, పాక్ సైన్యం జరిపిన దాడుల్లో మరో ఇద్దరు మిలిటెంట్లు కూడా హతమైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News