: మాల్దీవుల్లో మంచినీటికి కటకట...ప్రజల ఆందోళనలు


మాల్దీవుల్లోని ప్రజలు మంచినీటికి కటకటలాడుతున్నారు. నిన్న నిర్లవణీకరణ ప్లాంటులో (సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే యంత్రం) జరిగిన అగ్నిప్రమాదం ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. తాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కాస్త సంయమనం పాటించాలని, ప్రజలు ఓపిగ్గా ఉండాలని, ప్రస్తుతం దేశంలో మంచినీటి సంక్షోభం నెలకొందని దేశాధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐదు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా, నిన్న భారత్ ఐదు కార్గో విమానాల్లో తాగునీటిని ఆ దేశానికి పంపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News