: ఏపీ, తెలంగాణల్లో మెగా లోక్ అదాలత్ లో పరిష్కరించదగిన కేసులు 1,72,457


మెగా లోక్ అదాలత్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1,72,457 కేసులు పరిష్కరించుకోవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ సేన్ గుప్తా తెలిపారు. దేశ వ్యాప్తంగా రెండో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించిన సందర్భంగా హైకోర్టుకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు మాట్లాడుతూ, కేసుల పరిష్కారంలో జాప్యం నివారించేందుకే లోక్ అదాలత్ లు ఏర్పాటు చేశామని అన్నారు. గతేడాది నిర్వహించిన లోక్ అదాలత్ లో 10 లక్షల కేసులు పరిష్కరించామని ఆయన చెప్పారు. ఈసారి మరిన్ని కేసులు పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ అదాలత్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో పరిష్కరించదగిన కేసులు 80,831 కేసులుండగా, తెలంగాణలో 91,626 కేసులు ఉన్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News