: ప్రశాంతంగా బ్లాక్ డే... ముగిసిన పాత బస్తీ ప్రార్థనలు


బ్లాక్ డే సందర్భంగా పోలీసు శాఖ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు సత్ఫలితాన్ని ఇచ్చాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. సమస్యాత్మక పాత బస్తీలో ప్రశాంతంగా ప్రార్థనలు ముగిశాయని ఆయన తెలిపారు. బ్లాక్ డే నేపథ్యంలో పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, రేపటి వరకు బందోబస్తు కొనసాగుతుందని తెలిపారు. కాగా, నేటి మధ్యాహ్నం అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించేందుకు యత్నించిన 50 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News