: రుణమాఫీపై జగన్ ధర్నాలు విడ్డూరం: గాలి ముద్దుకృష్ణమ
ఏపీలో రైతు రుణమాఫీపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేయడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని ఆ పార్టీ సీనియిర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. అందునా ధర్నాలు చేయడం ఇంకా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు రుణమాఫీ చేయలేనన్న జగన్, ఇప్పుడెందుకు దానిపై మాట్లాడుతున్నారని ఎదురు ప్రశ్నించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చంద్రబాబు చేశారన్న ముద్దుకృష్ణమ, కనీస జ్ఞానం లేకుండా జగన్ విమర్శించడం శోచనీయమని అన్నారు.