: భయం గుప్పిట ఫిలిప్పీన్స్... 3 కోట్ల మందిని వణికిస్తున్న హగుపిట్ తుపాను
మరి కొద్ది గంటల్లో ఫిలిప్పీన్స్ ను భీకర హగుపిట్ తుపాను తాకనుండగా, ఇప్పటికే బలమైన గాలులతో భారీ వర్షం కురుస్తున్నట్టు తెలుస్తోంది. హగుపిట్ టైఫూన్ నెమ్మదిగా పసిఫిక్ సముద్రంలోని ఫిలిప్పీన్స్ వైపు కదులుతుండగా, దాదాపు 3 కోట్ల మంది ప్రజలు ఈ రేయి ఎలా గడుస్తుందా? అని బిక్కుబిక్కుమంటున్నారు (భారత కాలమనంతో పోలిస్తే ఫిలిప్పీన్స్ 3 గంటలు ముందు వుంటుంది). ఆరు లక్షల మందికి పైగా తీర ప్రాంత ప్రజలు ఇప్పటికే పునరావాస కేంద్రాలలో చేరారు. టైఫూన్ ప్రభావం మొదటగా వుండే టక్లోబాన్ నగరంలో మరింత మందిని శిబిరాలకు తరలిస్తున్నారు. గత ఏడాది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత తుపానుగా రికార్డు అయిన హైయన్ వల్ల ఫిలిప్పీన్స్‌లో 8 వేల మంది చనిపోయిన సంగతి తెలిసిందే.