: ఏపీ రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలు, 1.2 లక్షల మంది ప్రజలు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని సరిహద్దుల మధ్య మొత్తం 29 గ్రామాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గ్రామాల పరిధిలో 1,02,401 మంది జనాభా ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో 32,143 మంది ఎస్సీలు, 4,663 మంది ఎస్టీలు, 65,592 మంది ఇతరులు ఉన్నారు. ఈ 29 గ్రామాల పరిధిలో 51,786 ఎకరాల భూమి ఉండగా, అందులో పట్టా భూములు 37,701 ఎకరాలు, దేవాదాయ భూమి 723 ఎకరాలు, అటవీ భూమి 585 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 10,656 వ్యవసాయ కుటుంబాలు ఉండగా, వారిలో 1914 మంది ఎస్సీలు, 417 మంది ఎస్టీ కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా, నేటి సాయంత్రం కురగల్లు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, సింగాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల రైతులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలవనున్నారు.