: బీజేపీలో చేరిన వైసీపీ నేత వెంకట్రావు
భారతీయ జనతా పార్టీ విశాఖలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన వస్తోంది. వైఎస్సార్సీపీ నేత చొక్కాకుల వెంకట్రావు ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు సమక్షంలో ఈరోజు బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన చొక్కాకుల అపజయం పాలయ్యారు. ఆయనతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కూడా కమల తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీగా బీజేపీని పటిష్ఠం చేయడమే ప్రధాని లక్ష్యమని చెప్పారు.