: ఉగ్రవాదులు మన ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకున్నారు: మోదీ
అవినీతి నుంచి జార్ఖండ్ కు విముక్తి కలిగించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగుతున్నారని చెప్పారు. జవాన్ల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. దేశం కోసం అమరులైన వారిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు.