: విరాట్ తో రిలేషన్ పై ఏదీ దాచడం లేదు: అనుష్క శర్మ


క్రికెటర్ విరాట్ కోహ్లీతో తనకున్న సంబంధంపై తాజాగా బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ స్పందించింది. అతనితో తన సంబంధం రహస్య వ్యవహారం కాదంటోంది. ఈ విషయం గురించి పబ్లిక్ గా మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పింది. ఈ మేరకు ఓ గ్రూప్ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ, "ఎవరూ ఏదీ దాచలేదు. చాలా సాధారణంగా మా జీవితాన్ని గడుపుతున్నాం. మా ఇద్దరి మధ్య సంబంధం గురించి బయట మాట్లాడాలని కోరుకోవడంలేదు. దీన్నొక వినోద వార్తా అంశంగా చేయదల్చుకోలేదు. ఇద్దరినీ కలిపి చూసినప్పుడు ఏదీ దాచం. కానీ మాట్లాడం" అని విలేకరులకు వివరించింది. అయితే తన వ్యక్తిగత జీవితం గురించి కేవలం స్నేహితులతో చెప్పాలనుకుంటున్నానని, ప్రపంచానికి కాదని భావిస్తున్నట్టు అనుష్క తెలివిగా చెబుతోంది.

  • Loading...

More Telugu News