: కాశ్మీర్ లో బూటకపు ఎన్నికలు నిర్వహిస్తున్నారు: హఫీజ్ సయీద్


ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ లక్ష్యంగా జమాద్ ఉద్ దవా అధినేత, ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 'బూటకపు ఎన్నికలు' నిర్వహించి బీజేపీ విజయం పొందాలనుకుంటోందన్నాడు. ఆ విధంగా కాశ్మీర్ వివాదాస్పద భూభాగం కాదని ప్రపంచానికి మోదీ చెప్పాలనుకుంటున్నట్టు ఆరోపించాడు. అసలు ప్రతిసారి మోదీ ఎందుకు కాశ్మీర్ లో పర్యటిస్తున్నారని కూడా ప్రశ్నించాడు. లాహోర్ లో నిర్వహిస్తున్న పార్టీ రెండు రోజుల సమావేశంలో హఫీజ్ మాట్లాడుతూ, పైవిధంగా వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ఆసియా ఉపఖండంలో యుద్ధం అనివార్యమని హెచ్చరించిన ఈ ఉగ్రనేత... కాశ్మీర్ తప్పకుండా విముక్తి పొందుతుందని, 1971 భారత్-పాక్ యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటామని, అహ్మదాబాద్, గుజరాత్ బాధితులు న్యాయం పొందుతారనీ అన్నాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ లోని అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి కాశ్మీర్ పై ఒకే ఉమ్మడి విధానాన్ని ఏర్పరచుకోవాలని తాను కోరుకుంటున్నట్టు హపీజ్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News