: విద్యుత్ చౌర్యానికి పాల్పడేవారిని బహిరంగంగా చెప్పుతో కొట్టాలి: యూపీ గవర్నర్
విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వ్యక్తులపై యూపీ గవర్నర్ రామ్ నాయక్ మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేశారు. విద్యుత్ దొంగలను వీధుల్లో బహిరంగంగా చెప్పులతో కొట్టాలని అన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడేవారిని బహిరంగంగా ఉరితీయాలని ఇంతకు ముందు ఆయన అన్నారు. అయితే, మానవతా కారణాలతో ఉరితీయాలన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొన్నప్పటికీ... ప్రపంచంలో మరెక్కడా లేనంతగా మన దేశంలో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు, మానవ వనరులు, విద్యుత్తు మధ్య సమతుల్యత ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.