: శ్రీకాకుళం అబ్బాయి, జపాన్ అమ్మాయి... ఒకటైన శుభవేళ
అతను శ్రీకాకుళం జిల్లా దరివాడకి చెందిన మోహన్ వంశీ. ఆమె జపాన్ కు చెందిన అసాకొ తోడా. ఇద్దరూ యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎంఎస్ చేశారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో ఈనెల 3న వారు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిరువురూ యుఎస్‌ఏలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు శుక్రవారం నాడు సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకుని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామికి పూజలు నిర్వహించారు. వధూవరులను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు.