: సిరిసిల్లలో 26 గుంటల స్థలం కొన్న కేటీఆర్


టీఎస్ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో 26 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థానిక బైపాస్ రోడ్డులో ఇంటి నిర్మాణం కోసం ఈ స్థలాన్ని కొన్నారు. నిన్న ఆయన స్వయంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి స్థలాన్ని రిజిస్టర్ చేయించారు. దీనికోసం రూ. 24,024 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. 2009లో సిరిసిల్ల నుంచి తొలిసారి పోటీ చేసినప్పుడు... తాను సిరిసిల్లలో నివాసం ఉంటానని నియోజకవర్గ ప్రజలకు ఆయన మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలుపుకుంటున్నారు.

  • Loading...

More Telugu News