: ఉగ్రవాదులు తట్టుకోలేకే దాడులకు దిగారు: మోదీ


జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ లో జరిగిన తొలి విడత ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదవ్వడాన్ని ఉగ్రవాదులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. దానిని ఎలా వ్యక్తం చేయాలో తెలియని ఉగ్రవాదులు, అక్కడి ప్రజల్లో నెలకొన్న చైతన్యాన్ని, సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీసేందుకు దాడులకు పాల్పడుతున్నారని మోదీ స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వాస్తవాలు అర్ధం చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు యావద్భారత దేశం శిరసు వంచి సలాం చేస్తోందని ఆయన తెలిపారు. అమర జవానుల త్యాగాలను ఎన్నటికీ మరవలేమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News