: యాదగిరిగుట్టను అపవిత్రం చేస్తున్న ప్రేమ జంటలు


ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టను ప్రేమ జంటలు అపవిత్రం చేస్తున్నాయి. నమ్మకం, విశ్వాసం, పవిత్రతతో పలువురు భక్తులు నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో స్వామివారిని దర్శించుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలోని లాడ్జీలను ప్రేమజంటలు విహార యాత్రా స్థలంగా ఎంచుకుంటున్నాయి. దీంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న పలు జంటలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గత వారం కూడా ఇలాంటి రోజునే యాదగిరిగుట్టలోని పలు లాడ్జీలపై దాడులు నిర్వహించిన పోలీసులు, 10 జంటలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News