: విజయవాడ రామవరప్పాడులో కారుదగ్ధం...కారులోంచి దూకేసిన యువకుడు
విజయవాడ శివారు రామవరప్పాడు రింగు రోడ్డుపై ఓ కారు దగ్ధమైంది. విజయవాడ నుంచి హైదరాబాదువైపు వస్తున్న జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారును డ్రైవ్ చేస్తున్న యువకుడు మంటలను గమనించి ఒక్క ఉదుటన దూకేయడంతో ప్రాణాలు దక్కించుకోగలిగాడు. అయితే అతను దూకిన క్షణాల్లోనే మంటలు చెలరేగి కారు మొత్తం దగ్ధం కావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అలాగే పశ్చిమ గోదావరిలో జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కాగా, ఆ ఘటనలో కూడా ప్రయాణికులు క్షణాల్లో అప్రమత్తమై దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో గడ్డివాములు కాలిపోయాయి.