: 'బ్లాక్ డే' సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి: రైల్వేశాఖ


డిసెంబర్ 6న 'బ్లాక్ డే' సందర్భంగా రైల్వే శాఖ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజును పురస్కరించుకుని డిసెంబర్ 6ను 'బ్లాక్ డే' గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, రైల్వే ఆస్తులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అందువల్ల సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ సూచించింది. అంతే కాకుండా రైల్వే స్టేషన్ లో కానీ, ట్రైన్ లో కానీ అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కానీ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని రైల్వే శాఖ సూచించింది. అందుకోసం 1322 టోల్ ఫ్రీ నెంబర్ ను కేటాయించినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News