: డిసెంబర్ 8 నుంచి 12 వరకు తెలంగాణలో షర్మిల పరామర్శ యాత్ర
వైఎస్సార్సీపీ అధినేత జగన్ సోదరి షర్మిల తెలంగాణలో చేపట్టనున్న పరామర్శ యాత్ర డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. తన పరామర్శ యాత్రలో 18 గ్రామాలలో 18 మందిని పరామర్శించనున్నారు. బ్రాహ్మణపల్లిలో వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రను మలాపూర్ లో ముగించనున్నారు. షర్మిల తొలి దశ పరామర్శ యాత్రను కేవలం మహబూబ్ నగర్ జిల్లాకు మాత్రమే పరిమితం చేశారు. అనంతరం ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు.