: కరెన్సీ నోట్లపై ముద్రించేందుకు గాంధీ కంటే మెరుగైన వ్యక్తులేరీ?: ఆర్బీఐ ప్యానెల్


కరెన్సీ నోట్లపై ఇతర జాతీయ నేతల బొమ్మలను ముద్రించాలన్న ప్రతిపాదనపై రిజర్వ్ బ్యాంకు ప్యానెల్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. కరెన్సీ నోట్లపై ముద్రించేందుకు గాంధీ కంటే మెరుగైన వ్యక్తులెవరూ లేరని ఈ మేరకు ప్యానెల్ స్పష్టం చేసింది. 2010లో అప్పటి ప్రభుత్వ సూచన మేరకు రిజర్వ్ బ్యాంకు భవిష్యత్ కరెన్సీ నోట్ల డిజైన్ పై ఓ కమిటీ ఏర్పాటు చేసిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. గాంధీతో పాటు ఇతర నేతల బొమ్మలను ముద్రించే అంశాన్ని ఈ కమిటీ లోతుగా పరిశీలించిందని జైట్లీ వివరించారు. అయితే, భారత దేశ ఔన్నత్యాన్ని మహాత్ముడి కంటే మెరుగ్గా చాటే వారెవరూ లేరని కమిటీ తేల్చిందని చెప్పారు.

  • Loading...

More Telugu News