: హైదరాబాద్ వేదికగా 'టెక్ ఫర్ సేవ' జాతీయ సదస్సు
సేవా భారతి, యూత్ ఫర్ సేవ సంస్థల ఆధ్వర్యంలో 'టెక్ ఫర్ సేవ' (టీఎఫ్ఎస్) పేరిట జాతీయస్థాయి సదస్సు ఈ నెల 12 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరగనుంది. సదస్సు వివరాలను 'యూత్ ఫర్ సేవ' అధ్యక్షుడు భరత్ అనుమోలు నేడు మీడియాకు తెలిపారు. తదుపరి తరానికి వినూత్న ఉత్పాదనలు అందించాలని కృషి చేస్తున్న వారిని, కార్పొరేట్ సంస్థలు, ఎన్జీఓలకు పరిచయం చేయడమే సదస్సు లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సదస్సులో 100కు పైగా టీంలు వారి ఆలోచనలను పంచుకుంటాయని తెలిపారు. సుమారు 1000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, రవిశంకర్ ప్రసాద్ లతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులు ముఖ్య అతిథులుగా రానున్నారని తెలిపారు.