: చంద్రబాబుది ముమ్మాటికీ నమ్మక ద్రోహమే: వైఎస్సార్సీపీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు చేసింది ముమ్మాటికీ నమ్మక ద్రోహమేనని వైఎస్సీర్సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆళ్ల నాని విమర్శించారు. ఏలూరులో వారు మాట్లాడుతూ, అధికారం కట్టబెడితే రుణమాఫీ అమలు చేసి రైతులను, డ్వాక్రా మహిళలను అప్పుల ఊబినుంచి బయటకి తీసుకువస్తానని హామీ ఇచ్చిన బాబు, అధికారం రాగానే 5 వేల కోట్ల రూపాయల రుణాలు మాత్రమే తీరుస్తామంటూ మాట మారుస్తున్నారని ఆరోపించారు. బాబు నిజంగానే మారిపోయారని, ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తరువాత మరోలా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చేవరకు వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News